వీఆర్వోలను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు

హైదరాబాద్: వీఆర్వో వ్యవస్థ రద్దుపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.. ప్రభుత్వం నుండి క్లారిటీ వచ్చిన తర్వాతే స్పందిస్తామని టెస్రా ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి  చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్చడం మంచిదే.. కాలానుగుణంగా చట్టాలు మార్చాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారిన కాలానికి అనుగుణంగా నూతన రెవెన్యూ చట్టాలను తీసుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వీఆర్ఓ వ్యవస్థ ను రద్దు చేస్తామని ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదన్నారు. వారి అధికారాలను తగ్గిస్తారా..? లేదా పూర్తిగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తారా..? అనే అంశం పై క్లారిటీ వచ్చిన తరువాత స్పందిస్తామని వంగ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రక్షాళన చట్టాల మార్పును మేము స్వాగతిస్తున్నాం-సుధాకర్ వీఆర్వో సంఘం ప్రధాన కార్యదర్శి.

రెవెన్యూ వ్యవస్థల ప్రక్షాళన, చట్టాల మార్పును మేము స్వాగతిస్తున్నాము..  వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినా మమ్మల్ని రెవెన్యూలోనే  కొనసాగించాలని వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ కోరారు. తమను ఇతర డిపార్ట్మెంట్ లో కి పంపితే ఆత్మ గౌరవ సమస్య వస్తుందన్నారు. తమ పై అవినీతి ముద్ర వేయడం బాధాకరం అన్నారు. మాకు రికార్డులు అప్పజెప్పేందుకు అభ్యంతరం లేదు.. కానీ మమ్మల్ని దొంగల చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. ముందుగా మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్ బదిలీ చేస్తారో చెప్పాలి… అది చెప్పకుండా రికార్డులు బదిలీ చేయమని చెప్పడం భావ్యం కాదని పేర్కొన్నారు.

 

 

 

Latest Updates