పత్తి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం

హైదరాబాద్: ఈ సీజన్ లో పత్తి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. చివరి బస్తా వరకు పత్తి కొనుగోలు చేస్తామన్నారు. హైదరాబాద్ లో బ్యాంకర్లతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపైనా రివ్యూ చేసినట్టు కిషన్ రెడ్డి చెప్పారు.

ఆత్మనిర్భర్ భారత్ కింద.. హైదరాబాద్ లో 2 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ కి రుణాలివ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. అక్టోబర్‌ 10 లోపు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు కిషన్ ‌‌రెడ్డి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో యూరియా స్టాక్‌ ఉందని తెలిపారు కిషన్‌ ‌రెడ్డి. విదేశాల నుంచి రెండు షిప్స్‌లో యూరియా వస్తుందని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.

Latest Updates