కేంద్రం ఆదేశిస్తే POKను స్వాధీనం చేసుకుంటాం

ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)కు పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించి… స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు. పాక్ నుంచి పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల వ్యాఖ్యానించారు.

POKను పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకుని భారత్ లో అంతర్భాగం చేయడమే మా తదుపరి అజెండా అని చెప్పారు రావత్. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే దేశంలోని వ్యవస్థలు నడుచుకుంటాయన్నారు. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు.

Latest Updates