వరల్డ్ కప్ క్రికెట్ జట్టును 20న ప్రకటిస్తాం : MSK ప్రసాద్

  • శ్రీకాళహస్తిలో ఇండియన్ క్రికెట్ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ MSK ప్రసాద్

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్. ఆలయ అధికారులు ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందించి … వేద పండితుల ఆశీర్వచనం అందించారు.

రాబోయే ప్రపంచ కప్ లో ఆడే క్రికెట్ జట్టును ఏప్రిల్ 20వ తేదీన ప్రకటించబోతున్నామన్నారు ఎమ్మెస్కే ప్రసాద్. మన జట్టును దాదాపు  ఏడాదిన్నర కాలంగా పరిశీలించి… అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న జట్టును ఎంపిక చేస్తామన్నారు. జట్టు కూర్పుకోసం పలు సమీక్షలు నిర్వహించి విజయవంతమైన జట్టు కోసం కసరత్తు చేశామన్నారు. ఇంగ్లండ్ లో జరిగే వరల్డ్ కప్ గెల్చుకుంటామన్న నమ్మకం బలంగా ఏర్పడిందని అన్నారు.

Latest Updates