సెంచరీ కొట్టి మా సత్తా ఏంటో చూపిస్తాం

ఎవరితో పొత్తు లేకుండా, ఎక్స్ ఆఫీసీయో ఓట్లు కూడా అవసరం లేకుండానే జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు మంత్రి గంగుల. 100 పైగా సీట్లు గెలుచుకొని మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుంటామన్నారు. గ్రేటర్ పీఠంపై  సొంతంగా గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొట్టి టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. దేశానికే ఆదర్శంగా హైదరాబాద్ ను సీఎం కేసీఆర్ తయారు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పై బీజేపీ తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు గంగుల.

కొత్త క్రెడిట్ కార్డులివ్వొద్దు..ఆర్బీఐ ఆదేశం

Latest Updates