ఏషియా కప్ షెడ్యూల్ మారిస్తే ఒప్పుకోం: పీసీబీ

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్​ తో నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ కోసం ఏషియా కప్ షెడ్యూల్ లో మార్పులు చేస్తే ఆమోదించబోమని పాకిస్తాన్ బోర్డ్ ఆఫ్​క్రికెట్ సీఈవో వసీం ఖాన్ చెప్పారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం యూఏఈలో సెప్టెంబర్ లోనే ఏషియా కప్ టీ20 టోర్నమెంట్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సెప్టెంబర్ లో ఏషియా కప్ నిర్వహణపై కచ్చితమైన వైఖరితో ఉన్నాం. హెల్త్​ ఇష్యూస్ ఉంటే తప్ప టోర్నీ తప్పక జరుగుతుంది. ఐపీఎల్ కోసం ఏషియా కప్ షెడ్యూల్ లో మార్పులు చేయడానికి మేం ఒప్పుకోం. కొందరు నవంబర్–డిసెంబర్ లో ఏషియా కప్ నిర్వహిస్తారని అంటున్నారు. ఏషియా కప్ ను ముందుకు జరిపితే కేవలం ఒక సభ్య దేశం కోసం అలా చేసినట్టు అవుతుంది. దానికి మేం మద్దతు ఇవ్వం. నవంబర్–డిసెంబర్ లో న్యూజిలాండ్, జింబాబ్వే సిరీస్ లకు పాక్ ఆతిథ్యం ఇస్తోంది. అదే టైమ్ లో ఏషియా కప్ కు పాక్ ఆతిథ్యం ఇవ్వడం సాధ్యపడదు’ అని వసీం స్పష్టం చేశారు.

Latest Updates