మున్సిపాలిటీ పరిధిలో హెల్మెట్ అక్కర్లేదు!

టౌన్‌లో చిన్నచిన్ప పనుల కోసం వెళ్లేటప్పుడు పది నిమిషాల్లో వచ్చేద్దాం కదా అని చాలా మంది టూవీలర్స్ హెల్మెట్ పెట్టుకోరు. కానీ బయటకు వెళ్లి పోలీసులకు దొరికారంటే ఫైన్ తప్పదు. ఇకపై ఇలాంటి ఫైన్లు ఉండబోవని గుజరాత్ సర్కార్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మోటార్ వెహికల్ చట్ట సవరణ తర్వాత భారీ ఫైన్లపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పునరాలోచించి చిన్న సవరణ చేసింది. ఇక మున్సిపాలిటీల పరిధిలో బైక్‌పై తిరిగే వాళ్లు హెల్మెట్ లేకపోయినా ఫైన్ కట్టాల్సిన అవసరం తేదని ప్రకటించింది.

కండిషన్స్ అప్లై

రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ కొత్త రూల్ అమలులోకి తెస్తున్నామని గుజరాత్ మంత్రి ఆర్సీ ఫల్డూ చెప్పారు. ఆయా టౌన్ల పరిధిలో తిరిగే టూవీలర్స్ హెల్మెట్ పెట్టుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టమని తెలిపారు. అయితే, టౌన్ లోని గల్లీ రోడ్లు దాటి, స్టేట్ హైవేలు, జాతీయ రహదారులు, ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు మాత్రం హెల్మెట్ తప్పనిసరి అని స్సష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, గల్లీల్లో మార్కెట్లకు, ఇతర పనుల మీద వెళ్లే వాళ్లను ఫైన్స్‌తో ఇబ్బందిపెట్టకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

More News

విచారణలో గోప్యత.. ఘటనా స్థలానికి నేడు దిశ నిందితులు!
డాక్టర్ “దిశ” పై అభ్యంతరకర పోస్ట్ లు : స్మైలీ నాని అరెస్ట్
రేప్ కేసు పెట్టిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు

Latest Updates