ఇవాళ, రేపు వర్ష సూచన

మరఠ్వాడా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్ గఢ్ , దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

హిందూమహాసముద్రం , దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో వాతావరణంలో మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ : రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది. హైదరాబాద్ సహా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంకాలం గాలివాన పడే సూచనలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 km వేగంతో బలమైన గాలులు వీస్తాయి.

కోస్తా ఆంధ్ర: రాగల 2 రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 45 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

రాయలసీమ: అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో 48 గంటల పాటు జల్లులకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తలిపింది.

మధ్యాహ్నం ఎండ మాత్రం తగ్గదు

జల్లులు కురిసినప్పటికీ… మధ్యాహ్నం ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండవనీ.. పలుచోట్ల ఎక్కువగా కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో శుక్ర, శనివారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

Latest Updates