24 గంటల్లో భారీ వర్షాలు : వాతావరణ శాఖ

వైజాగ్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశముందని అన్నారు.

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు విశాఖ వాతావరణ శాఖ అధికారి ప్రొఫెసర్ రామకృష్ణ.

Latest Updates