రాష్ట్రంలో ఇయ్యాల, రేపు వ‌ర్షాలు

హైదరాబాద్, వెలుగు: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మధ్య ఉపరితల ఆవర్తనంఏర్పడిందని పేర్కొంది. దీంతో రాష్ర్టంలో ని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోపలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పెద్దపల్లిలోని జూలపల్లిలో 8, వనపర్తి టౌన్ లో 4.5, కుమ్రంభీం జిల్లాలోని వంకులంలో 4.7, కౌతాలలలో 4.4, కరీంనగర్ లోని అర్నకొండలో 4.2. నిర్మల్ లోని కుంతాలలో 3.8 సెంటీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్

Latest Updates