ఈ నెల 25న ఢిల్లీలో చేనేత కార్మికుల ధర్నా

తెలంగాణలో చేనేత కార్మికుల మరణాలను నిరసిస్తూ ఈ నెల 25న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చేనేతల ఐక్య కార్యచరణ కమిటీ చైర్మన్ దాసు సురేష్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక.. ఇప్పటి వరకు 350 మంది కార్మికులు చనిపోయారని, చనిపోయిన కార్మిక కుటుంబాలను ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అదుకోలేదని అన్నారు. వారికి ఎలాంటి నష్ట పరిహారం అందజేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని కమిటీ ఛైర్మన్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఎన్ని హామీలు ఇచ్చిన అవి ఆచరణ కావటం లేదని సురేష్ అన్నారు. వీటన్నింటిని నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల నేతలు , కార్మికులు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో దర్నా చేస్తామని అన్నారు. చేనేత కార్మికుల చావులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకవెళ్తామని సురేష్ అన్నారు.

Latest Updates