ప్రాణాలతో చెలగాటం: వీల్ చైర్ లో లారీని పట్టుకున్న దివ్యాంగుడు

సైకిల్ పైనో లేదంటే బైక్ పైనో వెళుతూ పక్కగా వెళ్లే వాహనాలను పట్టుకుని ప్రమాదకరంగా రైడ్ చేస్తుంటారు కొందరు యువకులు. ప్రమాదం అని తెలి సీ స్టంట్లు చేస్తుంటారు. కానీ, ఓ దివ్యాం గుడూ అలాంటి స్టంటే చేస్తే..!? చేస్తే కాదు.. చేశాడు. వీల్ చైర్ లో కూర్చు ని లారీని పట్టుకుని ప్రమాదకరంగా వెళ్లాడు. అదీ రద్దీగా ఉన్న హైవేమీద. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జరిగిం దీ ఘటన. ఆ టైంలో లారీ 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళుతోందట. అయినా కూడా ఆ లారీని పట్టుకుని జర్నీ చేశాడా దివ్యాం గుడు. లారీ పక్కన నుంచే ఓ కారు ఓవర్ టేక్ చేస్తూ వెళ్లింది. అదే టైంలో దివ్యాం గుడూ చాకచక్యం గా లారీని వదిలేసి పక్కకు

వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియలేదు. దక్షిణాఫ్రికా రోడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్​ కార్పొ రేషన్ మాత్రం ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసింది. దేశంలో ఏటా 14 వేల మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నా రని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థి తుల్లో సహించబోమని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Updates