బరువు తగ్గడం.. కష్టమేం కాదు

బరువు తగ్గడమంటే తక్కువ ఫుడ్ తినాలి. అనవసరమైన ఫ్యాట్ కరిగించాలి. అందుకే తినేటప్పుడు బరువు తగ్గాలన్న విషయాన్ని బుర్రలో పెట్టుకోవాలి. అలా చేస్తే తక్కువ తినే అవకాశం ఉంటుంది. అలాగే బట్టల సైజు పెంచుకుంటూ వెళ్లకుండా ఏ డ్రెస్ వేసుకున్నా ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా మైండ్​ని ప్రిపేర్ చేయడం వల్ల బరువు తగ్గాలనే ఆలోచన బలంగా పడుతుంది. నెమ్మదిగా బరువు తగ్గడం మొదలవుతుంది.

ప్లేట్ చిన్నదే కానీ బెనిఫిట్స్ ఎక్కువ

అన్నం, శ్నాక్స్ ఏవైనా సరే ఎంత తింటున్నాం అనే దానిపై క్లారిటీ ఉండాలి. ఎంత తింటున్నామో గమనించుకోవాలి.  ఏ ఫుడ్ తిన్నా చిన్న సైజు ప్లేట్​లోనే తినాలి. ఇలా తక్కువ సైజులో ఫుడ్ తినడం వల్ల బరువు ఆటోమేటిక్​గా తగ్గిపోతుంది. దాంతోపాటు కడుపు ఫుల్​గా ఉన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీంతో మళ్లీ ప్లేట్​లో రెండోసారి ఫుడ్ పెట్టుకోవాలి అనిపించదు.

గోల్డెన్ రూల్

బరువు తగ్గాలనుకునే వాళ్లు కచ్చితంగా నమిలి తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ ఫుడ్ తిన్నా ఎక్కువసేపు నమలాలి. దీనివల్ల డైజెషన్ ఈజీగా అవ్వడమే కాకుండా ఫ్యాట్ పెరిగే ఛాన్స్ ఉండదు. దాంతోపాటు కొంచెం తిన్నా పొట్ట ఫుల్​గా ఉంటుంది.  దీనివల్ల ఎంత తినాలో అంతే తింటారు. అందుకే వెయిట్​లాస్​లో నమిలి తినడాన్ని గోల్డెన్ రూల్ అంటారు.

ఇట్ల తినొద్దు

టీవీ చూస్తూనో, సెల్ ఫోన్​లో మాట్లాడుతూనో చాలామంది ఫుడ్ తింటుంటారు. దీనివల్ల వాళ్లకు తెలియకుండానే ఎక్కువ తినేస్తుంటారు. దీంతో బరువు పెరిగిపోతుంది. కానీ, తినేటప్పుడు టీవీ, సెల్ ఫోన్, బుక్స్​కు దూరంగా ఉండాలి. ఎంత తింటున్నారో చూసుకుంటూ తినాలి. ఇలాగైతే తక్కువ తింటారు. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

ఎక్కువగా తాగడమే మంచిది

ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినకుండా నీళ్లు తాగాలి. ఇలా చేస్తే ఎక్కువగా ఫుడ్ తినకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. నీళ్లు తాగితే కడుపు నిండుతుంది కూడా. అందుకే గుర్తుకొచ్చినప్పుడల్లా నీళ్లు తాగడం బెస్ట్. లంచ్, డిన్నర్ చేసేముందు కూడా ఒక గ్లాసు నీళ్లు తాగడంతో తక్కువ ఫుడ్ తింటారు.

జంక్ ఫుడ్​తో డేంజర్

టిఫిన్, లంచ్, డిన్నర్ వంటి మెయిన్ మీల్స్ మాత్రమే తినాలి.  జంక్ ఫుడ్ అస్సలంటే అస్సలు తినొద్దు. జంక్ ఫుడ్ తింటే బరువు తగ్గే ఛాన్స్​ ఉండదు. అందుకే అలాంటి తిండికి దూరంగా ఉండాలి.

హెల్దీ శ్నాక్స్ బెస్ట్

శ్నాక్స్ తినాలనుకునేవాళ్లు కచ్చితంగా హెల్దీ శ్నాక్స్  ప్రిఫర్ చేయాలి. డ్రై ఫ్రూట్స్, ఆయిల్ లేకుండా చేసినవి, ఉప్పు చల్లకుండా ఉండే ఫుడ్ ఐటమ్స్ మాత్రమే తినాలి. లేదంటే శ్నాక్స్ టైంలో  ఫ్రూట్స్ తినొచ్చు. ఇలా చేస్తే హెల్దీగా ఉండటమే కాదు అనవసరమైన ఫ్యాట్ కూడా పెరగదు.

హాయిగా నిద్ర

నిద్ర తక్కువైనా  బరువు పెరిగిపోతారు. నిద్ర సరిపోకపోతే హార్మోనల్ డిస్టర్బెన్స్ పెరుగుతుంది. దీనివల్ల బరువు ఒక్కసారిగా పెరిగిపోతారు. అందుకే సరైన నిద్ర అవసరం. శరీరానికి, మనసుకి తగినంత రెస్ట్ ఇస్తే చేయాల్సిన పనులేవైనా ఈజీగా చేసేయొచ్చు. 

Latest Updates