నేనేమైనా క్వింటాలు బరువుంటానా?: ప్రియాంక

లోక్ సభ ఎన్నికల  ప్రచారంలో దూకుడు పెంచారు నేతలు. ఎవరికి  తోచిన విధంగా వారు ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తూర్పు యూపీ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సామాన్య జనంతో కలిసిపోతున్నారు. వారితో మమేకమవుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు.

బుధవారం అమేథిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంక గాంధీ. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రియాంకకు లడ్డూలతో తూలాభారం వేసేందుకు ఏర్పాటు చేశారు. నేనేమైనా క్వింటాలు బరువుంటాననుకుంటున్నారా? ఏంటి అని చమత్కరించారు.  తర్వాత నేతల విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. నేను కూర్చోను మీరే కూర్చోండి అని అన్నారు. దీంతో ఓ స్థానిక నేతను కాంటలో కూర్చోబెట్టారు. ఆయన బరువుకు సరిపడా స్వీట్లను తూకం వేసి వారిని అక్కడున్న జనానికి పంచి పెట్టారు. తర్వాత ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Latest Updates