బాబ్రీ మసీదు కేసు తీర్పును స్వాగతిస్తున్నాను.. జై శ్రీరాం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు… బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి తెలిపారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్.కే. అద్వానీ, మనోషర్ జోషీతో పాటు మరో 32 మంది నిందితులు నిర్దోషులంటూ తీర్పు వెలువడటంపై అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. తీర్పుపై స్పందిస్తూ… ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాన‌ని అన్నారు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన వార్త అందిందని అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం పట్ల నా వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతను ఈ తీర్పు తెలియ‌జేస్తుంద‌ని పేర్కొన్నారు. జై శ్రీరాం అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Latest Updates