
హైదరాబాద్ : వెల్స్పన్ గ్రూప్‌కు చెందిన వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతోంది . రూ.1,100 కోట్లతో చందనవెల్లి వద్ద కొత్తగా నెలకొల్పిన మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని శనివారం ప్రారంభించింది . రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ వెల్స్పన్ కొత్త మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో పూర్తి స్థాయిలో సేఫ్టీ, హైజీన్ పాటించేలా ఏర్పాట్లు చేశారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. 1,600 మందికి ఈ ప్లాంట్ లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. వెల్స్పన్ తాజా ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏడాదికి 40 మిలియన్ స్క్వేర్ మీటర్లు. అత్యా ధునిక మెషినరీతో కస్టమర్లకు కావల్సిన ఎలాంటి షేడ్ (రంగు)నైనా అందించగలుగుతామని వెల్స్పన్ ఈ సందర్భంగా పేర్కొంది .
కార్పెట్ టైల్స్ , గ్రీన్స్ (ఆర్టిఫిషియల్ గ్రాస్), బ్రాడ్ లూమ్ కార్పె ట్స్ (వాల్ టూ వాల్ కార్పెట్) వంటి ప్రొడక్స్ట్ ను ఇక్కడ తయారు చేస్తారు. వెల్ స్పన్ పేటెంటెడ్ ప్రొడక్ట్ క్లిక్ ఎన్ లాక్ టైల్స్ నూ ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఫెసిలిటీకి పక్కనే, వెల్ స్పన్ గ్రూప్ అడ్వాన్స్ డ్ టెక్స్ టైల్ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌కు మంత్రి శంకుస్థా పన చేశారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే రూ.400 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ తెలిపింది. ఫ్లోరింగ్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయి భారీ గ్రోత్ టార్గెట్‌గా పెట్టుకుంటున్నట్లు వెల్ స్పన్ గ్రూప్ ఛైర్మన్ బీకే గోయెంకా చెప్ పారు. ఫ్లోరింగ్ రంగంలో కొత్త ఇనొవేటివ్ ప్రొడక్ట్‌ల ఆఫరింగ్‌పై తాము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌తో పాటు, ఎగుమతుల మార్కె ట్లోనూ కస్టమర్ బేస్‌ను పెం చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇనొవేటివ్ ఫ్లోరింగ్ ప్రొడక్స్ట్ తో గ్లోబల్ గా లీడర్ షిప్ పొజిషన్ సాధించడమే లక్ష్యమని గోయెంకా తెలిపారు.
ఇండియాలో టైల్స్ మార్కెట్ విలువ 35,000 వేల కోట్లని, ఇనొవేటివ్ ప్రొడక్స్ట్ తో తమ వాటా పెంచుకోవాలనుకుంటున్నామని వెల్ స్పన్ ఫ్లోరింగ్ సీఈఓ ముకేష్ సల్వాని వెల్లడించారు. స్టోన్ పాలిమర్ కాంపోజిట్ టైల్స్ ను పరిచయం చేస్తున్నామని, దీంతో కస్టమర్ల అభిరుచుల్లో మార్పు తీసుకు రావాలని అనుకుంటున్నామని చెప్పారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తోపాటు, కన్జూ మర్ రిసెర్చి కి వెల్ స్పన్ కంపెన పెద్దపీట వేస్తుందన్నారు. వెల్ స్పన్ కొత్త ఫెసిలిటీలో 2022 నాటికి 20 శాతం రెన్యువబుల్ ఎనర్జీ, 2030 నాటికి నూరు శాతం రెన్యువబుల్ ఎనర్జీ వినియోగించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. చందనవెల్ల వద్ద నెలకొల్పిన ఈ ప్లాంట్ చుట్టూ 5 వేల మొక్కలను ఇప్పటికే నాటగా, రాబోయే మూడేళ్లలో 50 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా చేసుకున్నారు. హోమ్ టెక్స్ టైల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే వెల్స్పన్ గ్రూప్ టర్నోవర్ 2.7 బిలియన్ డాలర్లు.