తొందర్లో వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ మాస్కులు

న్యూఢిల్లీ: టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ కంపెనీ వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ ఇండియా హెల్త్‌‌‌‌, హైజీన్‌‌‌‌(శుభ్రత) సెగ్మెంట్‌‌‌‌లోకి అడుగుపెడుతోంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా మాస్కులు, మెడికల్‌‌‌‌ గౌన్లు, చేతి తొడుగులు వంటివి తయారు చేయనున్నామని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.  వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ హెల్త్‌‌‌‌  బిజినెస్ ద్వారా మెడికల్‌‌‌‌ ప్రొఫెషనల్స్‌‌‌‌కు పర్సనల్ కేర్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌లను వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఇప్పటికే ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో కంపెనీ టెక్నికల్‌‌‌‌ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో మాస్కులను తయారు చేసి పంపిణి చేశామని వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ ఇండియా సీఈఓ దిపాలి గొయంక్‌‌‌‌ అన్నారు. దీనిని నెమ్మదిగా బిజినెస్‌‌‌‌లా మార్చాలని చూస్తున్నామని పేర్కొన్నారు. వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కింద రోజుకి 2.5 లక్షల మాస్కులను తయారు చేయాలని వెల్‌‌‌‌స్పన్‌‌‌‌ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌వేస్తోంది. వీటిలో మూడు పొరల సర్జికల్‌‌‌‌ మాస్కులు, రీయూజబుల్‌‌‌‌, ఎన్‌‌‌‌95 మాస్కులూ ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!

 

Latest Updates