అద్భుతం ఖాయం.. ఈ రాత్రి కోసమే ఎదురుచూస్తున్నాం

ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ప్రయోగంలో అత్యంత కీలకమైన ల్యాండింగ్ ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి 2.30 మధ్యలో జరగనుంది. 15 నిమిషాల పాటు జరగబోయే అత్యంత కీలమైన ల్యాండింగ్ పైనే చంద్రయాన్ 2 ప్రయోగం ఆధారపడి ఉంటుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ల్యాండింగ్ ప్రాసెస్ లో సైంటిస్టులుగా తమకు ఊపిరి ఆగిపోయేంత టెన్షన్ ఉంటుందని.. క్షణ క్షణం అలర్ట్ గా ఉండాల్సిందేనని ఇస్రో చైర్మన్ శివన్ చెప్పారు. చంద్రయాన్ 2 లోని అన్ని పరికరాలు సరిగా పనిచేస్తున్నాయని.. ల్యాండింగ్ సేఫ్ గా జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నామన్నారు శివన్. గతంలో చంద్రయాన్ 1 సమయంలో జరిగిన పొరపాటు ఇపుడు జరగదని నమ్మకంగా చెప్పారు. ఈ రోజు రాత్రి జరిగే అద్భుతం కోసమే కొన్ని ఏళ్లుగా  ఇస్రో , దేశం ఎదురుచూస్తోందని చెప్పారు శివన్. చంద్రుడి దక్షిణ ధృవంపై ఇంతవరకూ ఏ దేశం కూడా కాలుమోపని ప్రాంతంలో ఇస్రో చంద్రయాన్ 2 దిగుతుందని చెప్పారు.

Latest Updates