బీజేపీకి ఓటేయాలని బీఎస్ఎఫ్ బెదిరింపులు

కోల్‌‌కతా: సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను బెదిరించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్)ను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ నేత, మంత్రి ఫిర్హాద్ హకీం అన్నారు. రాబోయే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బోర్డర్ ఏరియా ప్రజలను బీఎస్‌‌ఎఫ్‌‌తో భయపెట్టిస్తున్నారని చెప్పారు. బోర్డర్ ఏరియాలో బీఎస్ఎఫ్ జవాన్లను పంపి అక్కడి ప్రజలను తమ పార్టీకి ఓటేసేలా బీజేపీ బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ విషయంపై విచారణ చేపడతామని ఈసీ తమకు హామీ ఇచ్చిందన్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను బీఎస్ఎఫ్ ఖండించింది. తాము రాజకీయాలకు అతీతమని స్పష్టం చేసింది.

Latest Updates