జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగించిన బెంగాల్ ప్రభుత్వం

కరోనా కేసుల దృష్ట్యా పశ్చిమబెంగాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కరోనా నేపథ్యలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మమతా ఈ అఖిలపక్షాల మద్ధతుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కరోనా సమస్య రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని సడలింపులతో లాక్డౌన్ ను జూలై 31వరకు పెంచుతున్నాం. పాఠశాలలు, కళాశాలలు కూడా మూసివేయబడతాయి’ అని మమతా తెలిపారు.

బెంగాల్‌లో ఈ రోజు 445 కరోనావైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దాంతో రాష్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,173కు చేరుకుంది. ప్రస్తుతం 4,890 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా వల్ల ఈ రోజు 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 591కు చేరుకుంది.

నేటి అఖిలపక్ష సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. నాన్ కరోనా పేషంట్లు వైద్య సహాయం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష పార్టీలు సీఎం దృష్టికి తీసుకొచ్చాయి. దాంతో నాన్ కరోనా పేషంట్లకు సేవలను మరింత పెంచాలని ప్రైవేట్ ఆస్పత్రులకు సీఎం సూచించారు. కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా అనుమతులిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహారాష్ట్ర మరియు ఢిల్లీ రాష్ట్రాలు ఇప్పటికే అనుమతులిచ్చాయి అని ఆమె గుర్తుచేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సలహాలు ఇస్తారని ఆమె అన్నారు. ఇది వ్యాపారం చేయడానికి సమయం కాదు. కరోనా మహమ్మారి తరిమికొట్టడానికి ఆస్పత్రులన్నీ సేవా స్ఫూర్తితో పనిచేయాలని ఆమె అన్నారు.

అంఫాన్ తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి చేసే పంపిణీలో అవినీతిని మరియు పక్షపాతాన్ని సహించలేమని ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. మధురపూర్ 2 బ్లాక్ వద్ద ఒక కౌన్సిలర్ తనకు కావలసిన వారికి అంఫాన్ సహాయ నిధులను వృధాగా పంచారని తెలిసి మంగళవారం పదవి నుంచి తప్పించాం అని సీఎం తెలిపారు.

For More News..

ఆన్ లైన్ వేదికగా మరో హీరోయిన్ కు వేధింపులు

గేమ్ టాస్క్ కంప్లీట్ చేయలేక టీనేజర్ సూసైడ్

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో పలు ప్రాంతాలు మూసివేత

బలవంతంగా పురుగుల మందు తాగించి..

Latest Updates