వరల్డ్ కప్ తర్వాత గేల్ గుడ్ బై..

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ త్వరలోనే ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కానున్నారు. త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్… గేల్ కు చివరి టోర్నీ. ఆ మెగా టోర్నీ తర్వాత క్రిస్ గేల్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటాడని… వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. విండీస్ క్రికెట్ బోర్డుతో గొడవ కారణంగా… జాతీయ జట్టుకు ఆడడం బాగా తగ్గించేశాడు గేల్. 2018 జులైలో బంగ్లాదేశ్ పై చివరి వన్డే ఆడాడు. 39 ఏళ్ల గేల్… 284 వన్డేలాడి… 9వేల 727 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ కల్లా అతను 10వేల పరుగుల మైల్ స్టోన్ అందుకునే అవకాశాలున్నాయి.  2014లోనే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు గేల్.

 

Latest Updates