విండీస్ క్రికెట్ లెజెండ్ వీక్స్ కన్నుమూత

వెస్టిండీస్‌ లెజండరీ బ్యాట్స్ 95 ఏళ్ల మన్‌ సర్‌ ఎవర్టన్‌ వీక్స్ ఇవాళ( బుధవారం,జులై-2) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల విండీస్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు పలు దేశాల క్రికెట్‌ బోర్డులు, క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. 2019 జూన్‌ లో వీక్స్ కు మొదటి సారి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్ల పాటు అద్వితీయ ప్రదర్శన చేసిన వీక్స్ ను… విండీస్‌ దిగ్గజ క్రికెటర్లు సర్‌ క్లైడ్‌ వాల్కోట్‌, సర్‌ ఫ్రాంక వోరెల్‌, సర్‌ ఎవర్టన్‌ను కలిపి త్రీ డబ్ల్యూస్‌గా పిలుస్తారు. 48 టెస్టుల్లో సంచలన ప్రదర్శన చేసిన వీక్స్ 58.61 సగటుతో 4,455 పరుగులు సాధించాడు. టెస్టుల్లో వరుసగా ఐదు ఇన్నింగ్స్ ల్లో ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మన్‌ ఎవర్టన్.

Latest Updates