విండీస్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

చెన్నై: ఇండియా, వెస్టిండీస్ మధ్య చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో విండీస్ బిగ్ విక్టరీ సాధించింది. 289 టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో మరో ఓవర్ ఉండగానే ఛేదించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 రన్స్ చేసింది. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేక పోయారు. 289 టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ యంగ్ ప్లేయర్లు భారత ప్లేయర్లను ఆడుకున్నారు.

హెట్ మేయర్ (139) మెరుపు ఇన్నింగ్స్ కి తోడు షైహోప్ (102 నాటౌట్) సెంచరీ జోరుతో ఇండియాకు ఓటమి తప్పలేదు. వీరిద్దరిని ఔట్ చేసేందుకు భారత్ చాలా సమయం పట్టింది. ఈ లోపు మ్యాచ్ ఫలితం విండీస్ వైపు మళ్లింది. తర్వాత వచ్చిన ప్లేయర్లు ఆడుతు పాడుతూ టార్గెట్ ని ఫినిష్ చేశారు. కేవలం 2 వికెట్లు కోల్పోయి 48.5 ఓవర్లలో 289 రన్స్ చేసి ఫస్ట్ మ్యాచ్ ను తన ఖాతోలో వేసుకుంది విండీస్. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో లీడ్ లో ఉంది విండీస్.

 

Latest Updates