భారత్-విండీస్ మ్యాచ్ : ఫస్ట్ వన్డేకు వర్షం అడ్డంకి

గయానా : విండీస్ తో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ కు రెడీ అయ్యింది. గురువారం టీమిండియా, వెస్టిండీస్‌ మధ్య ఫస్ట్ వన్డే జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కురవడంతో మ్యాచ్‌ ఆలస్యమైంది. పిచ్‌ తడిగా ఉండటంతో ఇంకా టాస్‌ వేయలేదు. స్టేడియాన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మళ్లీ వాన రాకుండా ఉంటే మ్యాచ్‌ జరిగే అవకాశముంది. టి20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా జోరు మీద ఉంది. మూడు వన్డే సిరీస్‌ లోనూ సత్తా చాటాలని చూస్తోంది.

టీ20 సిరీస్ ను కోల్పోయిన విండీస్ వన్డే సిరీస్ నైనా సొంతం చేసుకోవాలనే కసిగా ఉంది. ఒక్క సిరీస్ అయినా గెలిచి సొంతగడ్డపై పరువునిలబెట్టుకోవాలని చూస్తుంది. ఈ సిరీస్‌ గెలిచి తమ దిగ్గజం క్రిస్‌ గేల్‌ కు సగర్వంగా వీడ్కోలు పలకాలని కరీబియన్లు భావిస్తున్నారు.

Latest Updates