పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

పంచలోహ విగ్రహాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల నుంచి… 30కిలోల దుర్గామాత విగ్రహం, నాగమణి డైమండ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2006 లో ముఠా తో చేరిన ప్రేమ్ చంద్ గుప్తా… నాగమణి డైమండ్‌ను ముంబైలో కొనుగోలు చేశారు. ఆ డైమండ్‌ను హైదరాబాద్‌లో కోట్ల రూపాయలకు విక్రయించాలని ప్లాన్ వేశారని… పక్కా ప్లాన్ ప్రకారం ముఠాలోని నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన సమాచారం తో నిందితులను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. కాకినాడ లో అమ్మవారి విగ్రహం తయారు చేయించి హైదరాబాద్ లో అమ్మకానికి పెట్టారని, ఈ ముఠా కి ముంబై ముఠా తో కూడా సంబంధాలు ఉన్నాయని అన్నారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్ కి చెందిన దేవేంద్ర , జాన్, అష్రఫ్, ప్రేమ్ చంద్ గుప్త ఉన్నారు.

Latest Updates