అతి తీవ్ర తుఫాన్ గా ఫొని

  • రేపు,ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు

గుండెల్లో గుబులుపుట్టిస్తున్నఫొని అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం పేర్కొంది. ఇదే జరిగితే 1891 తర్వాత ఏప్రిల్ నెలలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుఫాన్ గా ఫొని మారుతుంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఫొని కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణి స్తూ సోమవారం మధ్యాహ్నాని కి ట్రింకోమలీ(శ్రీలంక)కు తూర్పు ఈశాన్య దిశగా 620 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయ దిశగా 810 కి.మీ, మచిలీపట్నం కు దక్షిణ ఆగ్నేయ దిశగా 950 కి.మీ.దూరంలో ఉంటుం దని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫొని ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో(గంటకు 40 నుం చి 50 కి.మీ వేగం)జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిం ది. తుఫాన్ ప్రభావం వల్ల బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఓ వైపు తుఫాన్ ఆందోళనకు గురి చేస్తుంటే, మరో వైపు ఎండలు రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి . ఆదిలాబాద్‌‌లో సోమవారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణో గ్రత నమోదైంది. నిజామాబాద్‌‌లో 45, రామగుం డంలో 43.8, మెదక్‌‌లో 43.6, ఖమ్మంలో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణో గ్రతలు రికార్డయ్యాయి .

Latest Updates