కేంద్ర ప్యాకేజీతో పేదలకు ఏం లాభం?

దేశ ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నది
పేదలు, కార్మికులు కష్టాలు పడుతున్నరు: కాంగ్రెస్‌ చీఫ్‌
22 ప్రతిపక్ష పార్టీలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశంపై క్రూయల్​ జోక్​ అని కాంగ్రెస్​ చీఫ్​ సోనియాగాంధీ విమర్శించారు. దాని వల్ల పేదలకు ఎలాంటి లాభం చేకూరడం లేదని అన్నారు. కరోనా సిచ్యువేషన్​ను కంట్రోల్​ చేయడంలో, పేదల ఇబ్బందులు తొలగించడంలో, కార్మికులను సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం ఫెయిలైందని, ఫెడరలిజం స్ఫూర్తిని మరిచిపోయిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 22 ప్రతిపక్ష పార్టీల నేతలతో శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కరోనా, లాక్​డౌన్​ పరిస్థితులపై చర్చించారు. సరైన ప్లాన్​ లేకుండా లాక్​డౌన్​ను కేంద్రం విధించిందని, ఇప్పుడు దాని నుంచి ఎగ్జిట్​ అవడానికి కూడా సరైన ప్లాన్​ను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ విమర్శించారు. కోట్ల మంది వలస కార్మికుల కుటుంబాలను పూర్తిగా విస్మరించిందని, వారికి సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. ‘‘ప్రధాని రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని మే 12న ప్రకటిస్తే.. దాని వివరాలను ఐదురోజులపాటు ఫైనాన్స్​ మినిస్టర్​ ప్రకటిస్తూ వచ్చారు. ఇది దేశంపై క్రూయల్​ జోక్​లాంటిది. అన్ని అధికారాలను ప్రధానమంత్రి ఆఫీస్​ తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది వ్యతిరేకం. కరోనా లాంటి సిచ్యువేషన్​పై పార్లమెంట్​లో కానీ, స్టాండింగ్​ కమిటీల్లో కానీ చర్చించాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు” అని సోనియాగాంధీ మండిపడ్డారు.

21 రోజుల్లో అని చెప్పి..
కరోనాతో 21 రోజుల్లో యుద్ధం ముగుస్తుందని మొదట ప్రధాని చెప్పారని, ఇప్పటికే 4 సార్లు లాక్​డౌన్​ను పొడిగించారని, ఇప్పుడు వ్యాక్సిన్​ వచ్చేదాకా ఇంట్లోనే ఉండే పరిస్థితులు వచ్చాయని సోనియాగాంధీ అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రానికి స్పష్టమైన విధానం లేకుండా పోయిందని విమర్శించారు. కరోనా టెస్టుల్లోనూ ప్రభుత్వం ఫెయిలందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్​లో బెంగాల్​ సీఎం, టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్​ ఉద్దవ్​ ఠాక్రే, జార్ఖండ్​సీఎం హేమంత్​ సోరెన్​, ఎన్సీపీ చీఫ్​ శరద్​పవార్​, డీఎంకే లీడర్​ స్టాలిన్​, జేడీఎస్​ లీడర్​ దేవేగౌడ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, టీజేఎస్‌ నేత ప్రోఫెసర్‌ కోదండరామ్‌తో పాటు కాంగ్రెస్​ నేతలు రాహుల్​, ఆంటోనీ, పలు రీజినల్​ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆప్​ నుంచి ఎవరూ పాల్గొనలేదు. అంతకు ముందు మాయావతి కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

For More News..

కీలక పోస్టులకు ఇన్‌చార్జీలే దిక్కు

10 వేల మందిపై వ్యాక్సిన్‌‌ ట్రయల్స్‌‌

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

Latest Updates