లడాఖ్‌ విషయం అసలు ఏమైంది?: రాహుల్‌ గాంధీ

  • మరోసారి కేంద్రంపై విమర్శలు చేసిన ఎంపీ

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్రంపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆదివారం మరోసారి పలు ప్రశ్నలు లేవనెత్తారు. “ ఏమైంది మోడీ టెన్యూర్‌‌లో చైనా మన దేశంలోని భూభాగాన్ని ఆక్రమించింది” అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దాంతో పాటు గాల్వాన్‌ వ్యాలీ గొడవకు సంబంధించిన ఆర్టికల్‌ను కూడా పోస్ట్‌ చేశారు. గాల్వాన్‌ వ్యాలీలో జరిగిన గొడవలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. కాగా.. అప్పటి నుంచి రాహుల్‌ గాంధీ కేంద్రంపై పలు రకాలుగా విమర్శలు చేశారు. అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని, చైనా ఆర్మీని ఆపడంలో కేంద్రం ఫెయిల్‌ అయిందని విమర్శలు చేశారు. కాగా.. ఇటీవల జరిగిన చర్చల్లో చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంది.

Latest Updates