వృద్దులు  వయసులో ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా

వృద్దులు  వయసులో ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా

వృద్దులు... వయస్సులో ఉన్నవారిని పెళ్లి చేసుకొంటే ఆ జంట చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆచార్య చాణుక్యుడు తన నీతి కథల్లో తెలిపాడు.  భార్య భర్తలకు 5 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ ఉంటే వారి జీవితం సాఫీగా సాగిపోతుందట.  అంతకంటే ఎక్కువ ఉంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.  చాణక్యుడు తన చాణక్యనీతిలో వృద్ధులు, వయసులో ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

  • చాణక్యనీతులు ఇప్పటికీ మన ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాము. అలాగే ఆయన జీవితం గురించి అనేక సత్యాలను చెప్పాడు. అవి నేటికీ మనందరికీ ఆమోదయోగ్యం కాదు. మన జీవితంలో మనం ఏదో ఒక విధంగా సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాము. 

  •  ఆచార్య చాణక్యుడు  భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెబుతూ, ఈ వయోభేదంతో భార్యాభర్తలు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చని చెప్పారు. అలాగే పెళ్లి చేసుకునే జంట మధ్య వయస్సు తేడా ఎంత ఉండాలో చెప్పారు.

  • పురుషులకు ... స్త్రీలకు ఐదేళ్ల తేడా ఉండి వారిరువురు వివాహం చేసుకున్నట్లయితే దగ్గరి దగ్గరిగా వారి ఆలోచనలు.. జీవనశైలి ఒకే రకంగా ఉంటుంది.  వయస్సులో పెద్దగా తేడా లేక పోవడంతో స్నేహ సంబంధం కలిగి ఉంటారు.  

  • వైవాహిక జీవితంలో సమస్యలను ఎలా తొలగించాలో చాణక్యుడు వివరించాడు.

  •  జీవితం బాగా మంచిగా ఉండాలంటే.. భార్యాభర్తలు అన్నింటికంటే, ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని తప్పుగా అర్దం చేసుకోకూడదు.

  • పెళ్లి బంధాన్ని ఇద్దరూ గౌరవించాలి. ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటే ఆ కాపురం ఎప్పుడూ దుఃఖంతో నిండి ఉంటుంది.

  •  ఒకరికొకరు సరిపోయే వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే వారు ఒకరి అవసరాలను ఇంకొకరు తీర్చాలే ఉండాలి. అలా కాకుండా వృద్ధుడు, యువతిని పెళ్లాడితే ఆ దాంపత్యం ఎక్కువ కాలం నిలవదు.