మిషన్ ‘శక్తి’తో భారత్ కు తిరుగులేదు

శత్రు దేశాలు యుధ్ధానికై సై అంటే ..మేమేం తక్కువ కాదు అనేలా మిషన్ శక్తిని తయారు చేశారు భారత సైంటిస్టులు.  ఈ శాటిలైట్ బలం గురిచి చూస్తే..యాంటీ శాటిలైట్‌.. దీన్నే కైన‌టిక్ స్టిల్ వెప‌న్ అంటారు. ఢీకొట్ట‌డంతోనే శ‌త్రు శాటిలైట్‌ ను పేల్చేస్తారు. దీని కోసం స్పెషల్ వార్‌ హెడ్ల‌ను వాడ‌రు. పొజిష‌న్‌లో టార్గెట్‌ ను ఫిక్స్ చేస్తేనే, అంత త‌క్కువ‌ స‌మ‌యంలో శ‌త్రు శాటిలైట్‌ ను పేల్చే అవ‌కాశాలు ఉంటాయని తెలిపారు నిపుణులు. ఓ శాటిలైట్‌ ను పేల్చే ప‌రీక్షను భార‌త్‌ నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి. ప్ర‌స్తుతం అగ్ర దేశాలు స్పేస్ ఫోర్స్‌ ను సిద్ధం చేస్తున్నాయి.

ఈ క్రమంలో భార‌త్.. యాంటి శాటిలైట్ల‌న నిర్మించ‌డం అత్య‌వ‌సరం. అంత‌రిక్ష ఆయుధాలు భ‌విష్య‌త్తులో ఎక్కువ‌గా వాడే అవకాశాలు ఉంటాయ‌ని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మిష‌న్ శ‌క్తిని చేప‌ట్టారని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 2012 నుంచే యాంటీ శాటిలైట్లు అందుబాటులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ.. మిషన్ శక్తినొ ఇప్పుడు నిర్వహించాలన్న ప్రధాని మోడీ నిర్ణ‌యం ..తమకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింద‌టున్నారు DRDO సైంటిస్టులు. మిష‌న్ శ‌క్తితో అంత‌రిక్ష శ‌క్తిని భార‌త్ పెంచుకున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో అంత‌రిక్షలో మ‌హాశ‌క్తిగా భార‌త్ ఎదిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు శ‌త్రు దేశాల శాటిలైట్ల‌ను పేల్చే స‌త్తా అమెరికా, ర‌ష్యా, చైనా దేశాల‌కు మాత్ర‌మే ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో ఇండియా చేరింది. మంగళవారం DRDO సైంటిస్టులు నిర్వహించిన మిషన్ శక్తి పరీక్షలో 300 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్‌ ను పేల్చిన‌ట్లు తెలిపారు.

Latest Updates