కిషన్ రెడ్డికి, సీఎం కేసీఆర్ కు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో చెప్పాలి

హైద‌రాబాద్: ఇన్నాళ్లు బీజేపీ నేత‌లు.. త‌మ‌ను టీఆర్ఎస్ ఏమీ అనదని అనుకున్నార‌ని, కానీ నిన్న‌టి ఘటనతో బీజేపీ నేతలకు తత్వం బోధ‌ప‌డిందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన బండి సంజ‌య్‌ను గతంలో చెంప పగలగొడితేనే ఏం చేయలేదని, అందుకే పోలీసులు ఇప్పుడు మెడకాయ పిసికారని అన్నారు. బీజేపీ లో కేసీఆర్ అనుకూల ,వ్యతిరేక వర్గాలు బయటపడుతున్నాయని అన్నారు. నిజామాబాద్ లో ఉన్న అరవింద్..      సంజయ్ ను పరామర్శించడానికి కరీంనగర్ కు వెళ్లార‌ని, కానీ క‌రీంన‌గ‌ర్‌లోనే ఉన్న‌ మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. టీఆరెస్ తో బీజేపీ పెద్ద లీడర్లు కుమ్మక్కయ్యారన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి.. దుబ్బాక ఇష్యూ పై ఎందుకు రివ్యూ చేయలేద‌ని రేవంత్ అన్నారు. కలెక్టర్, సీపీని పిలిచి సమీక్షించే అధికారం ఉన్నా.. కిషన్‌రెడ్డి ఆ పనిచేయలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీ రఘురామరాజు కు కేంద్రం సెక్యూరిటీ ఇచ్చినపుడు…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,ఎంపీ అయిన సంజ‌య్‌ కి సెక్యూరిటీ ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు ఆలోచిస్తుందని అన్నారు. కేంద్రం నుంచి కూడా కిషన్ రెడ్డి ఎంక్వయిరీ వేయొచ్చని అన్నారు. కిషన్ రెడ్డికి- సీఎం కేసీఆర్ కు ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో చెప్పాలని రేవంత్ అన్నారు.

కేసీఆర్ ను కాదని కేంద్రంలో ఉన్న‌ బీజేపీ తెలంగాణ లో ఏం చేయద‌ని, హరీష్ ప్రచారం చేస్తే శాంతి భ‌ద్ర‌తలు తలెత్తనప్పుడు…మేము వెళ్తే ఎందుకు శాంతి భ‌ద్ర‌తలు తలెత్తుతాయ‌ని ప్ర‌శ్నించారు రేవంత్. బీజేపీ లో ఉన్న కొంత మంది ముఖ్యనేతలు ..తమ గెలుపు కోసం ఇతరులను బలిచేస్తున్నార‌న్నారు. వారి గెలుపు కోసం బలహీన మైన అభ్యర్థులను పోటీ లో దింపేలా ఇతర పార్టీ లతో కుమ్మక్కు అయ్యారన్నారు.

Latest Updates