అసలు కరోనా అంటే ఏంటో తెలుసా..

ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా కుటుంబానికి చెందిన ఈ వైరస్‌ను కనుగొన్న తర్వాత… దాని వల్ల వస్తున్న వ్యాధిని ‘కరోనా వైరస్‌ డీసీజ్’ అని పేరు పెట్టారు . 2019లో కనుగున్నందున ‘కోవిడ్‌–19’అని పిలుస్తున్నారు . ఇది కొత్తది కాబట్టి ‘నావల్ కరోనా వైరస్‌’ అంటున్నారు . ఇది సార్స్ లాంటిదే కావడంతో ‘సార్స్‌–కో వి2’ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పుడు అందరినీ భయపెడుతున్న వైరస్ పేరు… ‘సార్స్ కోవి2’, కరోనా అనే పేరు ఇప్పటికే వ్యక్తులకు, ప్రాంతాలకు, సంస్థలకు ఉండటం వల్ల అది ఒక వ్యాధిని సూచించే వైరస్‌గా మాత్రమే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్ యూహెచ్‌ఓ) కరోనా వైరస్ పేరును కోవిడ్-19గా మారుస్తున్నట్లు ప్రకటించింది.

2019 ఏడాది చివరలో సార్స్ వైరస్‌కు దగ్గరి సంబంధం ఉన్న వైరస్ చైనాలోని వుహాన్‌లో వెలుగు చూసింది. మొదట్లో వుహాన్ కరోనా వైరస్ పిలవగా తర్వాత SARS–COV–2గా పేరు పెట్టింది. ఆనారోగ్యానికి దారితీస్తున్న ఈ వైరస్‌కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) 2020 ఫిబ్రవరి 11న COVID–19గా పేరు మార్చింది. ఇది బీటా కరోనా వైరస్ జాతికి చెందింది.

కరోనా అనే పేరు లాటిన్ భాషలోని ‘కరోనా క్రౌన్’ అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం ‘కిరీటం లేదా పుష్పగుచ్ఛం’. వైరిడే కుటుంబానికి చెందిన ఈ కరోనా వైరస్‌లు 120 నానో మీటర్ వ్యాసంతో కొలిచే విరియాన్స్(వైరస్ కణాలు) కలిగి ఉంటాయి. కరోనా వైరస్‌లు క్షీరదాలు, పక్షులలో వ్యాధులకు కారణమయ్యే ఆర్‌‌ఎన్‌ఏ ఆధారిత వైరస్‌ల సమూహం. ఇవి మానవులలో ప్రధానంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

కరోనా వైరస్‌లను మొట్టమొదటగా 1960లలో గుర్తించారు. కరోనా విరిడే సాధారణంగా రెండు జాతులనుకలిగి ఉంటుంది. అవి కరోనా వైరస్, టోరో వైరస్.

మానవులలో కరోనా వైరస్ జాతి సార్స్. జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు లాంటి లక్షణాలతో శ్వాసకోశ వ్యాధికి కారణమవుతుంది. ఇది మానవులలో తొలిసారిగా 2002లో వెలుగు చూసింది. ఇది గుర్రపు డెక్క, గబ్బిలాల నుంచి మానవులకు సోకుతుందని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది.

2012లో ఎంఈఆర్‌‌ఎస్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ డ్రొమెటరీ ఒంటెల నుంచి మానవులకు వ్యాపిస్తుందని కనుగొన్నారు. మొదటి కేసు సౌదీ అరేబియాలో కనుగొన్నారు. తర్వాతి సంవత్సరంలో ఫ్రాన్స్, జర్మనీ, జోర్డాన్, ఖతార్, ట్యునీషియా, యూఏఈ, యూకేలో వెలుగు చూసింది.

సాధారణ లక్షణాలు కలవి
హ్యుమన్ కరోనా వైరస్-OC43 (HCOV-OC43 )
హ్యుమన్ కరోనా వైరస్-HKU1
హ్యుమన్ కరోనా వైరస్-NL63(HCOV-NL63 న్యూహెవెన్ కరోనా వైరస్)
హ్యుమన్ కరోనా వైరస్- 229E(HCOV-229E)

తీవ్ర లక్షణాలు కలవి
మిడిల్ ఈస్ట్ రెస్పి రేటరీ సిం డ్రోమ్ సంబంధిత కరోనా వైరస్ (MERSCOV)
సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిం డ్రోమ్ కరోనా వైరస్ (SARS COV) లేదా (SARS క్లాసిక్)
సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిం డ్రోమ్ కరోనా వైరస్-2 (SARS-COV-2) లేదా (nCOV-2019)
HCOV-229E, NL63, OC43, HKU1 రకానికి చెందిన కరోనా వైరస్‌లు మానవ జనాభాలో నిరంతరం ప్రసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా పెద్దలు, పిల్లలలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

కరోనా వైరస్ వర్గీకరణ
రాజ్యం -రైబోవిరియా
కుటుంబం- కరోనా విరిడే
ఉప కుటుంబం-ఆర్థో కరోనా విరినే
ఆర్డర్-నిడో వైరల్స్

For More News..

వాట్సాప్ గ్రూపులలో హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల డేటా

సిబ్బంది కోసం రూ. 750 కోట్లు కేటాయించిన వార్నర్ మీడియా

మాస్కు లేకుంటే 300.. గుంపుగా ఉంటే 500 ఫైన్

కరోనా మందనుకొని తాగి 300 మంది మృతి

Latest Updates