అర్ధరాత్రి సర్క్యులర్ ఏంది?..  అంతా గ్యాంబ్లింగ్

స్వస్తిక్ కాకుండా వేరే మార్కు ఉంటే ఎట్ల కౌంట్ చేస్తరు?

కే సీఆర్ చెప్పినట్లు ఎస్ఈసీ పార్థసారథి చేస్తున్నడు

సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఎంతవరకైనా పోరాటం చేస్తం : బండి సంజయ్

హైదరాబాద్ , వెలుగు: దొంగల ముఠా మాదిరిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అర్ధరాత్రి సర్క్యులర్ ఇచ్చారని బీజేపీ స్టే ట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు . ‘‘బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు  ఉండాలి కానీ, స్వస్తిక్ గుర్తు తో పాటు ఎలాంటి మార్క్ ఉన్నా ఓటు వేసినట్లు గానే పరిగణించాలని అర్ధరాత్రి ఎన్ని కల కమిషనర్ పార్థసారథి సర్క్యులర్ ఇవ్వడంలో మతలబేంది? కౌంటిం గ్ కు కొన్ని గంటల ముందు సర్క్యులర్ ఇవ్వడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై ఎవరూ కోర్ట్ కు వెళ్లకుండా ఉండేందుకే అర్ధరాత్రి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతోంది” అని ఆయన అన్నారు . టీఆర్ ఎస్ ను గెలిపించేం-

దుకు ఆఫీసర్లు కుట్రలు చే స్తున్నారని, ఎన్నికల కమిషనర్ పార్థసారథి పె ద్ద గ్యాంబ్లర్ గా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తుతోపాటు ఎలాంటి మార్కు ఉన్నా ఓటుగా పరిగణించొచ్చని గురువారం అర్ధరాత్రి ఎస్ ఈసీ సర్క్యులర్ జారీ చే సిన తర్వాత బండి సంజయ్ జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఎస్ ఈసీ ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లారితే ఓట్ల కౌంటింగ్ పెట్టు కొని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని మండిపడ్డారు . దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సిందేనని, అప్పటివరకూ బీజేపీ వదిలిపెట్టదన్నారు . ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ఎంత దూరమైన వెళ్తుందని, న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఆ గంటలో పోలింగ్ ఎట్ల పెరుగుతది?

పోలింగ్ రోజు సాయంత్రం 5 నుం చి 6 గంటల మధ్య జరిగిన పోలింగ్ లో ఏదో తేడా ఉందని, గంటలోనే పోలింగ్ శాతం ఎలా పెరిగిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు . ‘‘మా అనుమానాలు నిజమయ్యేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అర్ధరాత్రి జారీ చేసిన సర్క్యులర్ ను చూస్తే తెలుస్తోంది. బ్యాలెట్ పేపర్ లో స్వస్తిక్ మార్కుతోపాటు ఏ మార్క్ ఉన్నా ఓటుగా పరిగణించాలని అందులో  ఇచ్చారు. అంటే అర్థమేంది? సీఎం కేసీఆర్ చెప్పి నట్లుగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నడుచుకుంటున్నారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలి. మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం. ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరిస్తున్నదో ప్రజలకు చెప్తాం. కేసీఆర్ తీరును ప్రజల్లో ఎండగడతాం” అని హెచ్చరించారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి సీఎస్ , డీజీపీ, జీహెచ్ ఎంసీ కమిషనర్ , ఇతర ఆఫీసర్లు మీటింగ్ పెట్టుకొని టీఆర్ఎస్  గెలిచేందుకు ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. పోలింగ్ రోజు 4 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజీ చెప్పిన పార్థసారథి.. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య జరిగిన పోలింగ్ పర్సంటేజీని అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ప్రశ్నించారు.

Latest Updates