పొలిటికల్ ఎంట్రీపై కంగన రనౌత్ ఏం చెప్పిందంటే..!

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్‌‌‌కు మధ్య డైలాగ్ వార్ రోజురోజుకీ హీటెక్కుతోంది. ముఖ్యంగా కంగన ఆఫీస్‌‌ను బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చేసిన తర్వాత ఈ వివాదం మరింత రాజుకుంది. ఈ ఘటన అనంతరం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోపాటు శివ సేన పార్టీపై కంగన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కంగన ఈ విషయాన్ని వివాదం చేస్తున్నారని గాసిప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి కంగన సమాధానం చెప్పింది. తనకు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

‘రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతోనే మోడీజీకి నేను సపోర్ట్ చేస్తున్నానని ఎవరైతే భావిస్తున్నారో వారికి ఒక్కటే చెబుతున్నా. మా తాత కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా 15 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. మా కుటుంబం రాజకీయాల్లో చాలా పాపులర్. గ్యాంగ్‌‌స్టర్ మూవీ తర్వాత ప్రతి ఏడాది నాకు ఆఫర్స్ వచ్చాయి. మణికర్ణిక సినిమా అనంతరం కాంగ్రెస్‌‌తోపాటు బీజేపీ కూడా నాకు టికెట్ ఆఫర్ చేసింది. ఒక ఆర్టిస్ట్‌‌గా నా పనిలో నేను నిమగ్నమై ఉన్నా. రాజకీయాల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. వ్యక్తిగత స్వేచ్ఛతో నాకు నచ్చిన వారికి నేను మద్దతు ఇస్తా. ఈ విషయంలో ట్రోలింగ్స్‌‌ను ఆపాలి’ అని కంగన రనౌత్ చెప్పారు.

Latest Updates