వంటలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి..?

ఉప్పు లేనిదే వంటకి రుచి రాదు, ముద్ద గొంతు దిగదు. కానీ, అదే ఉప్పు అర టీ స్పూన్ ఎక్కువైనా కూడా సేమ్​ ఎఫెక్ట్ అప్పుడు కూడా తినలేం. మరి అనుకోకుండా ఉప్పు ఎక్కువైతే ఎలా?  ఆ వంట వేస్టవకుండా ఉప్పుని తగ్గించటానికి కొన్ని చిట్కాలున్నాయి…

కూరలో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైతే ఆలుగడ్డని పెద్ద ముక్కలుగా కోసి మళ్ళీ స్టవ్ మీద ఒక పదినిమిషాలు ఉడికిస్తే చాలు.

అయితే, కూరలో ఉండే ఉప్పుతో పాటు  నీళ్లని కూడా ఆలుగడ్డ పీల్చుకుంటుంది. గ్రేవీ తగ్గకుండా ఉండటానికి కొన్ని నీళ్లని కూడా యాడ్ చేయాలి. 

 ఉప్పు ఎక్కువైన కూరలో కొద్దిగా కొబ్బరి పాలు పోసినా కూడా ఉప్పు సరిపోతుంది, అంతే కాదు డిష్ కూడా క్రీమీగా తయారవుతుంది. 

మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఉప్పు ఎక్కువైతే కొద్దిగా నిమ్మ రసం కూడా ఆ ఉప్పగా ఉండే రుచిని తగ్గిస్తుంది. 

కొద్దిగా పెరుగు, లేదంటే ఫ్రెష్ క్రీం కూడా  గ్రేవీలో కలపొచ్చు.

కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేస్తే ఎక్కువైన ఉప్పుని ఈ పిండి పీల్చుకుని గ్రేవీలో పైకి తేలుతుంది. అప్పుడు దాన్ని తీసేయవచ్చు.

ఉప్పు కొద్దిగా మాత్రమే ఎక్కువైతే, కొద్దిగా చక్కెర వేసినా సరిపోతుంది. టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది.

Latest Updates