నడి వయసులో ఏం తినాలంటే..

‘ఏం చేతనైతలేదు సార్’.. డాక్టర్ల దగ్గరకు వచ్చే పెద్దవాళ్లు చెప్పే మొదటి సమస్య ఇదే. వాళ్లు ఏ చిన్న పనిచేసినా అలసిపోతారు. ముఖ్యంగా నడి వయసు దాటిన తర్వాత చాలా మందిలో కనిపించే సమస్య ఇది. ఇలాంటి  అలసటకు ప్రధాన కారణం బలం లేని  ఆహారం. అందుకే వయసు పైబడిన వాళ్ల కోసం  అమెరికాలోని ఒమహాలో క్రీఘ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోన్ ఎకెర్సన్ ..  కొన్ని డైట్ సీక్రెట్స్ సూచిస్తున్నారు.

ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వేన్ క్యాంబెల్ రీసెర్చ్ ప్రకారం…  ఇప్పుడున్న జనరేషన్ నలభై ఏళ్లు దాటిన తర్వాత బలహీనపడడం మొదలవుతోంది. అందుకు కారణాలు ఎన్నో ఉండొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్,  ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సరైన జాబ్ లేకపోవడం, లైఫ్లో సెటిల్ కాకపోవడం వంటి సమస్యలు మెంటల్ గా స్ట్రెస్ పెంచుతాయి.  ఫిజికల్ డెవలప్ మెంట్ పై  కూడా దీని ప్రభావం ఉంటుంది. అయితే అందరిలో ఇవే సమస్యలు బలహీనతకు కారణమని చెప్పలేం. అందుకే బాడీని సరైన పోషకాలతో మెయింటెయిన్ చేయాలి. అందుకే నడి వయసులో కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా ఉండాలంటే కొన్ని డైట్ సీక్రెట్స్ ఉన్నాయి. అవేంటంటే…

వీటిని దగ్గరికి రానివ్వొద్దు..

బలహీనతకు ఇన్ డైరెక్ట్ గా స్ట్రెస్, యాంగ్జైటీ, బోర్డమ్, లోన్లీనెస్, అన్ హెల్తీ హ్యాబిట్స్ కారణమవుతాయి. అందుకే ముందు వీటిని దగ్గరకు రానివ్వొద్దు. నడి వయసుకు దగ్గరయ్యేకొద్దీ అన్ హెల్తీ హ్యాబిట్స్ కు దూరంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వంటివి ఏ ఏజ్ వాళ్ల హెల్త్ నైనా పాడు చేస్తాయి. అందుకే మిడిల్ ఏజ్ తర్వాత కూడా హెల్దీగా ఉండాలంటే మెంటల్ హెల్త్ ను దెబ్బతీసి,  ఫిజికల్ హెల్త్ ను  పాడుచేసేవి దగ్గరికి రాకుండా చూసుకోవాలి.  ఇక డైట్ సీక్రెట్స్ ఏంటంటే..

స్లో కార్బ్స్..

మెదడుకు, మజిల్స్ కు అవసరమైన ఎనర్జీని అందించేవి కార్బొహేడ్రేట్స్. అందుకే ఎనర్జీ కోసం కార్బొహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తినాలి. అయితే అవి స్లో కార్బ్స్ అయి ఉండాలి. అంటే.. రక్తంలోకి గ్లూకోజ్ను స్లోగా రిలీజ్ చేయాలి. అందుకోసం ముడి ధాన్యాలు, లెగ్యూమ్స్, ఫ్రూట్స్, వెజిటెబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికే వెళ్లొద్దు. ఎందుకంటే.. వయసు పెరిగేకొద్ది కార్బొహైడ్రేట్స్ను ప్రాసెస్ చేసే కెపాసిటి తగ్గుతుంది. ఒకవేళ ఎక్కువ కార్బొహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే.. పాంక్రియాస్ మరింత ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అలా ఉత్పత్తి చేయకపోతే శరీరంలో కార్బొహైడ్రేట్స్ నుంచి విడుదలైన గ్లూకోజ్ రక్తంలో కలిసి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతుంది. అందుకే  స్లో కార్బ్స్ ఫుడ్ తినడమే మేలు. రిఫైన్డ్ ఫుడ్స్, వైట్ రైస్, స్వీట్స్, చిరుతిండ్లు వంటివి తగ్గించాలి.

రైట్ కేలరీస్..

ఎక్కువగా కేలరీలు ఉన్న పుడ్ తినడం,  అసలే కేలరీలు లేని ఫుడ్ తినడం రెండూ డేంజరే. ఒబెసిటీతో బాధపడుతున్న 90 శాతం మందిలో.. ఆ సమస్యకు కారణం కేలరీలే. అయితే ఎక్కువగా తీసుకోవడం, లేదా పూర్తిగా తగ్గించడమే. అందుకే వయసు పైబడిన తర్వాత ఎవరు ఎన్ని కేలరీలు తీసుకోవాలనే దానిపై అవగాహన ఉండాలి. నడివయసుకు ముందు వెయిట్ మెయింటెయిన్ చేయడానికి ఎక్కువ  కేలరీల అవసరం ఉంటుంది. అదే నడివయసు దాటిన తర్వాత వెయిట్ మెయింటెయిన్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. అప్పుడు తక్కువ కేలరీల అవసరం ఉంటుంది. స్వీట్స్, స్నాక్స్ వంటివి తగ్గించి, తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి. అందుకే నడివయసు దాటిన వాళ్లకు ఇచ్చే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండి, మిగతా న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి.

ఆకలిని పెంచుకోవాలి..

వయసు పెరిగేకొద్దీ ఆకలి తగ్గుతుంది. అయితే ఆకలిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం చాలా మార్గాలున్నాయి. ఒకేసారి ఎక్కువ మొత్తం తినకుండా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు తినాలి. అదీ మంచి పోషక విలువలు ఉన్న వాటిని తినాలి.

దీనివల్ల అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.  జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఆకలి పెరుగుతుంది. ఏది పడితే అది తినకుండా.. పోషకాలతో నిండిన ఫుడ్తినాలి. అవసరమైన దానికంటే తక్కువ బరువు ఉంటే కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. సరిపడా బరువు ఉండి, మిగతా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే డ్రైఫ్రూట్స్, నట్స్, యోగర్ట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటివి తినాలి.

న్యూట్రియెంట్స్..

వయసు పైబడిన తర్వాత సరిపడా పోషకాలు శరీరానికి అందకపోతే మరెన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సరిపడా పోషకాలు తీసుకోవడమంటే సెల్ఫ్ డయాగ్నస్ చేసుకోవడమే. అయితే ఏ పోషకాలు తీసుకోవాలనే విషయాన్ని డాక్టర్లు చెబుతరు. రకరకాల పరీక్షల ద్వారా ఈ పోషకాల లోపాన్ని గుర్తిస్తారు.  మరీ తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేస్తారు. లేదంటే పోషకాలను భర్తీ చేసే ఆహారాన్ని సూచిస్తారు. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి12 వంటివి తగ్గకుండా చూసుకోవాలి.

 

Latest Updates