చిన్న వంతెన నిర్మించలేని నేతలెందుకు

చిన్న వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచిన నేతలతో ఏం ప్రయోజనమని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో పవన్‌ కల్యాణ్ రెండో రోజుపర్యటన కొనసాగుతోంది. ఇవాళ(గురువారం) ఉదయం జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో చర్చించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు కూడా బాగా ఆలోచించుకోవాలని సూచించారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల సంగతి తర్వాత.. జోహరాపురం బ్రిడ్జి వంతెన వంటి చిన్న సమస్యలను పరిష్కరిచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయన్నారు.  ప్రజాప్రతినిధుల మధ్య గొడవ కారణంగా వంతెన నిర్మాణం ఆగిపోవడం దారుణమన్నారు జనసేనాని.

Latest Updates