సూర్యకుమార్ ఏం తప్పు చేశాడు..బీసీసీఐపై భజ్జీ ఆగ్రహం

డొమెస్టిక్​ క్రికెట్‌ లో అద్భుతంగా రాణిస్తున్న​ సూర్యకుమార్​ యాదవ్‌ ను నేషనల్​ టీమ్‌ కు ఎందుకు ఎంపిక చేయడం లేదని వెటరన్ స్పిన్నర్‌ హర్భజన్​ సింగ్‌ సెలెక్షన్‌ కమిటీని ప్రశ్నించాడు. న్యూజిలాండ్‌ టూర్‌ కు వెళ్లే ఇండియా-ఎ టీమ్‌ లోకి సూర్యను తీసుకున్న సెలెక్టర్లు …శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌‌‌లో మాత్రం మొండిచేయి చూపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భజ్జీ.. బీసీసీఐ ఏ పద్ధతిలో సెలెక్షన్స్‌ చేసి అతడిని పక్కన పెట్టిందని ప్రశ్నించాడు. ‘సూర్యకుమార్‌ ఏం తప్పు చేశాడో నాకు అర్థం కావడం లేదు. టీమిండియా, ఇండియా–ఎ, బి జట్లకు తరచుగా ఎంపికవుతున్న మిగతా క్రికెటర్ల మాదిరిగానే అతను కూడా పరుగులు చేస్తున్నాడు. ఒక్కో ప్లేయర్‌ కు ఒక్కో రూల్​ ఎందుకు?’ అని ట్వీట్‌ చేశాడు.

Latest Updates