కరోనాకు కొత్త పేరు పెట్టిన WHO.. మార్పుకి కారణమిదే

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధికారికంగా కొత్త పేరును పెట్టింది. 2019 చివరిలో పుట్టిన ఈ కొత్త వైరస్ కారణంగా వస్తున్న జబ్బుకు కోవిడ్-19గా నామకరణం చేసినట్లు WHO ప్రకటించింది. ప్రజల్లో ఎటువంటి సందిగ్ధత లేకుండా చేసేందుకు కేవలం వైరస్ పేరును పిలవకుండా వ్యాధి పూర్తి పేరు వచ్చేలా కరోనా వైరస్ డిసీజ్-19 (కోవిడ్-19) అని పేరు పెట్టారు.

కరోనా అనే పేరు కొన్ని వస్తువులు, సంస్థలు, ప్రాంతాలు, వ్యక్తులకు కూడా ఉంది. అయితే ఆ పేరు వింటేనే భయాందోళనలకు గురవుతున్న పరిస్థితుల్లో మార్పుపై కొత్త వైరస్ వల్ల వస్తున్న వ్యాధికి పేరు మార్చడంపై WHO దృష్టి పెట్టింది. ఏ ప్రాంతాన్ని , జంతువును, మనిషిని, వస్తువును సూచించని విధంగా ఈజీగా పలికేలా కోవిడ్ అనే పేరు పెట్టామని WHO  చీఫ్ టెడ్రోస్ అదనమ్ తెలిపారు. అలాగే గతంలో వచ్చిన సార్స్, మెర్స్ వ్యాధులు కూడా కరోనా జినోమ్‌ వైరస్‌లే కావడం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టమైన తేడా ఉండేలా ఈ మార్పు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అలాగే భవిష్యత్తులో కొత్త కరోనా వైరస్‌ డిజీసెస్‌ వస్తే వాటిని వేరుగా గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.

Latest Updates