మారుతీరావు సూసైడ్‌నోట్‌లో ఏముంది?

ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సూసైడ్ చేసుకోవడానికి ముందు గదిలో సూసైడ్‌నోట్ రాసి పెట్టాడు. ఆ నోట్‌లో ‘తల్లీ అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అని రాశాడు. అంతేకాకుండా మారుతీరావు సూసైడ్ చేసుకోవడానికి ముందు చాలామందికి ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. మారుతీరావు చుట్టాలతో చాలా తక్కువగా మాట్లాడుతాడు. అటువంటిది ఆయన నిన్న రాత్రి సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఎప్పుడూ ఫోన్ చేయని వాళ్లకు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. మారుతీరావు ఫోన్ చాలా వరకు స్విచ్చ్ ఆఫ్ కాకుండా చూసుకుంటాడు. కానీ, నిన్న రాత్రి నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆయన భార్య అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆర్యవైశ్య భవన్‌కు వచ్చి.. సిబ్బంది సహాయంతో తలుపులు తీసి చూసేసరికి మారుతీరావు చనిపోయి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆయన గదిలో సూసైడ్‌నోట్‌తో పాటు ఆయనకు సంబంధించిన ఫోన్ మరియు సూట్‌కేసును స్వాధీన పరచుకున్నారు.

For More News..

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీటుకు బై ఎలక్షన్ వస్తదేమో

17 నెలల తర్వాత మండలికి వచ్చిన కేసీఆర్

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

Latest Updates