ఫేక్ న్యూస్ పై పోరుకు వాట్సాప్‘టిప్ లైన్‘ నెంబర్

నీకు ఫోన్ ఉందా అనే టైం నుంచి నీ ఫోన్‌‌‌‌‌‌‌‌లో వాట్సాప్ లేదా అనే పరిస్థితికి వచ్చేశాం . ఈ  రోజుల్లో సగానికి సగం పనులు వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో పూర్తి  చేస్తున్న వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదే సమయంలో వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో ఫేక్ న్యూస్ పోటు పెరిగిపోయింది. ఈ నేపథ్యం లో సార్వత్రిక ఎన్నికల వేళఅసత్య వార్తలు ప్రచారం కాకుండా ‘చెక్‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ టిప్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌’ పేరుతో వాట్సాప్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిం ది. వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో తిరిగే మెసేజ్ లపై ఏవైనా అనుమానాలు ఉంటే చెక్ పాయింట్ టిప్ లైన్(+91–9643000888) నెంబర్‌‌‌‌‌‌‌‌కు షేర్ చేయాలి. వాటిని వాటి మూలాల నుంచి నుంచి చెక్ చేసి నకిలీవో కాదో తిరిగి సమాచారం పంపుతుంది. ఈ టిప్ లైన్‌‌‌‌‌‌‌‌ను మీడియా స్కిల్స్ స్టార్టప్ ‘ప్రోటో’ నిర్వహిస్తుందని వాట్సాప్ ప్రకటించింది. యూజర్ పంపిన డేటాను చెక్ చేసి ‘నిజం’, ‘అబద్ధం’, ’తప్పుదోవ పట్టిం చేది’, ‘వివాదంలో ఉంది’, ‘పరిధిలోలేదు’ లేదా ప్రశ్నకు తగిన జవాబుతో సమాధానం ఇస్తుందని తెలిపింది. పిక్చర్స్, వీడియోలతో పాటు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషల్లో ని మెసేజ్‌‌‌‌‌‌‌‌లను ప్రోటో చెకిం గ్‌ కు స్వీకరిస్తుందని వివరించింది. అంతేకాకుండా పుకార్లుగా నిర్ధారణ అయిన మెసేజ్‌‌‌‌‌‌‌‌లను డేటా బేస్ లో దాచిపెడుతుం దని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్‌‌‌‌‌‌‌‌పై గతంలో పని చేసిన ‘డిగ్ డీపర్ మీడియా’, ‘మీడాన్’ కూడా ప్రొటోకు సాయం చేయనున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. వెరిఫికేషన్, ఇండియాలో రీసె ర్చ్ నియమావళిపై ఇవి తోడ్పాటునందిస్తాయని తెలిపింది. పుకార్లపై బాగా ఫోకస్ చేసిన సంస్థ మీడాన్. పుకార్ల వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌పై ఓ టెక్నాలజీని సైతం తయారు చేసిం ది. మెక్సికో, ఫ్రాన్స్ ఎన్నికల్లో సదరు టెక్నాలజీని వాడి పుకార్ల షికార్లను విజయవంతంగా అడ్డుకుం ది. ఎన్నికల తర్వాత ప్రొటో ఈ ప్రాజెక్టులో నేర్చు కున్న విషయాలను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్స్‌ట్ తో పాటు వేరే ఆర్గనైజేషన్లకు తెలియజేయనుంది. వాట్సాప్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌ లలో ఫేక్ న్యూస్ తిరగడం వల్ల కొన్ని ప్రాంతాల్లో  అమాయక జనంపై మూక దాడులు జరిగాయి. దీన్ని సర్కారు సీరియస్ గా తీసుకుం ది. దీం తో కదిలిన వాట్సాప్ నకిలీ వార్తలపై న్యూస్ పేపర్లు, అడ్వర్టయిజ్‌‌‌‌‌‌‌‌మెం ట్ల ద్వారా ప్రచారానికి పూనుకున్న విషయం తెలిసిం దే. ఇందులో భాగంగానే ఒకే సారి ఐదుగురు కన్నా ఎక్కువ మందికి మెసేజ్ లు ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌ చేసే వీలు లేకుం డా కొత్త రూల్స్ తెచ్చింది.

Latest Updates