అమెజాన్, వాట్సాప్ అప్పులిస్తాయంట

ముందు వస్తువులను కొని తర్వాత డబ్బులు చెల్లిం చే అవకాశాన్ని అమెజాన్‌‌‌‌ఇండియా కల్పి స్తోంది. ఇందుకోసం ‘అమెజాన్‌‌పే లేటర్‌‌‌‌’ పేరుతో ఓ క్రెడిట్‌ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత లాక్‌డౌన్‌‌టైమ్‌లో యుటిలిటీ బిల్లులను లేదా అత్యవసర వస్తువులను కొనుగోలు చేయడా నికి ఈ పే లేటర్‌‌ఫెసిలిటీని కస్టమర్లువినియోగిం చుకోవచ్చు. అమెజాన్‌‌(ఇండియా)లో లిస్టయిన ఏ ప్రొడక్ట్‌‌నైన క్ట్‌‌ కొనుగోలు చేయడానికి వడ్డీలేని అప్పును కంపెనీ ఆఫర్‌‌‌‌చేస్తోంది. ఈ అప్పును తర్వాతి నెలలో ఒకేసారి చెల్లిం చవచ్చు. లేదను కుంటే ఈఎంఐ ల కింద కన్వర్ట్‌‌చేసుకోవచ్చు. ఇలా ఈఎంఐల కింద కన్వర్చేట్‌‌ సుకుంటే మాత్రంనెలకు 1.5 శాతం నుంచి 2 శాతం వరకు వడ్డీని కంపెనీ వసూలు చేస్తుంది. ఈ అప్పును గరిష్టంగా 12 ఈఎంఐలలో చెల్లిం చొచ్చు. పే లేటర్‌‌‌‌లో భాగంగా కస్టమర్‌‌‌‌కనిష్టంగా ఒక్క రూపాయి నుంచి గరిష్టం గా రూ. 60,000 వరకు కొనుగోలు చెయొచ్చు. ఆర్‌‌‌‌బీఐ రూల్స్‌‌ప్రకారమే ఈ అప్పర్‌‌‌‌లిమిట్‌ ఉందని కంపెనీ పేర్కొంది. పేలేటర్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌ ఇలా.. ‘అమెజాన్‌‌పే లేటర్‌‌‌‌సర్వీస్‌’ కోసం అమెజాన్‌‌ మొబైల్‌‌యాప్‌ద్వారా రిజిస్ట ర్‌‌‌‌అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సర్వీసుకు డెస్క్‌‌ టాప్‌ సపోర్ట్‌‌లేదు. అమెజాన్‌‌పే లో కస్టమర్లుతమ కేవైసీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తయ్యాక పే లేటర్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌ స్టేటస్‌ను అమెజాన్‌‌పే డ్యాష్‌ బోర్డులో చెక్‌ చేసుకోవచ్చు. ఈ డ్యాష్‌ బోర్డులో ట్రాన్సాక్షన్స్‌‌ రికార్డ్స్‌ను చూసుకోవచ్చు.

స్మాల్‌‌ బిజినెస్‌‌లకుఫండ్‌ ..

అమెజాన్‌పై ఎక్కువగా ఆధారపడి నడుస్తు న్న స్మాల్‌‌, మీడియం బిజినెస్‌ల(ఎస్‌ఎంబీ) కోసం కంపెనీ ఓ సపోర్ట్‌‌ ఫండ్‌‌ను ఏర్పాటు చేసింది. లాజిస్టిక్‌‌ సెక్టార్‌‌‌‌లోని ఎస్‌ఎంబీల కోసం ఈ ఫండ్‌‌ను ఖర్చు చేయనుంది. డెలివరీ పార్టనర్లు , కొంత మంది ట్రాన్స్‌‌పోర్టేషన్‌ పార్టనర్ల కోసం ఈ ఫండ్‌‌ను వినియోగించనున్నామని అమెజాన్‌ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఎస్‌ఎంబీలకు లిక్విడిటీ సపోర్ట్‌‌ ఇవ్వడానికి, వీరి క్యాష్‌ ఫ్లో అవసరాల కోసం ఈ ఫండ్ ఖర్చు చేయనున్నా మని చెప్పింది. వీటితో పాటు ఈ బిజినెస్‌ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ ఖర్చులకు మద్దతుగా ఉంటామని పేర్కొంది.

Latest Updates