వాట్సాప్ లో అప్ డేటెడ్ ఫీచర్ ఏంటో తెలుసా?

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ‘గ్రూప్ కాలింగ్’ ఫీచర్ ను అపేడేట్ చేసింది. ఇక నుంచి వాట్సప్ లో గ్రూప్ వాయిస్ కాల్స్ తోపాటు వీడియో కాల్స్ లో ఒకేసారి ఎనిమది మంది మాట్లాడుకోవచ్చు. ఇంతకు ముందు వరకు ఏక కాలంలో నలుగురు మాత్రమే గ్రూప్ కాల్ చేసుకునే సౌలభ్యం ఉండేది. కొత్త అప్ డేట్ తో ఆ నంబర్ ఎనిమిదికి పెరిగింది. ఈ అప్ డేట్ ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంచింది. తమ యూజర్లు కాల్స్ కోసం యావరేజ్ గా 15 బిలియన్ల నిమిషాలు స్పెండ్ చేస్తున్నారని వాట్సాప్ తెలిపింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు కాల్స్ పై ఇంతగా టైమ్ స్పెండ్ చేసేవారు కాదని పేర్కొంది. సాధారణ చాట్స్ లాగే ఈ గ్రూప్ కాల్స్ కూడా ‘ఎండ్ టూ ఎండ్ ఎన్ స్క్రిప్టెడ్’ గా ఉంటాయని తెలిపింది. తక్కువ కనెక్టివిటీ ఉన్న ఏరియాల్లోనూ, లో ఎండ్ ఫోన్స్ లోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకుంటే గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చని వివరించింది.

Latest Updates