వాట్సప్ ప్రైవేట్‌ పాలసీ అప్‌డేట్‌తో వ్యక్తిగత మెసేజ్ లకు భద్రత

తమ సమాచారాన్ని ఫేస్‌బుక్‌ వాడుకుంటుందంటూ ఇటీవల వాట్సప్‌ అప్‌డేట్‌ నిబంధనలపై వచ్చిన విమర్శలపై వాట్సప్‌ స్పష్టతనిచ్చింది. తాజా మార్పులు స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపిన సమాచార రహాస్యాన్ని ఏవిధంగానూ ప్రభావితం చేయవని చెప్పింది. పుకార్లను తక్షణమే పరిష్కరించాలని వాట్సప్‌ కోరుకుంటుందని తెలిపింది. ఇది మీ వ్యక్తిగత సందేశాలకు భద్రత కల్పిస్తుందని స్పష్టం చేసింది. మీ పర్సనల్ మెసేజ్ లను చూడలేమని, మీ కాల్స్‌ను వినలేమంది. వాట్సప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ తమ వినియోగదారుల మెసేజ్ లను లేదా కాల్స్‌ను కూడా చదవలేదని స్పష్టం చేసింది.

గతవారం జరిగిన వాట్సప్‌ అప్‌డేట్‌ నిబంధనలపై ప్రజల విమర్శలతో మరో కొత్త అప్‌డేట్‌ను ప్రకటిస్తూ.. కొత్త అప్‌డేట్‌ ఫిబ్రవరి 8 నుండి వర్తిస్తుందని తెలిపింది. ప్రైవేట్‌ పాలసీ అప్‌డేట్‌పై వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తూ.. వాట్సప్‌ తన సైట్‌లో మరో ఎఫ్‌ఎక్యూ పేజీని విడుదల చేసింది. ఇది యాప్‌లో వ్యక్తిగత సమాచార మార్పిడిని ప్రత్యేకంగా హైలెట్‌ చేస్తుందని తెలిపింది. వాట్సప్‌లో మీ కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో మాట్లాడినా, SMSలు పంపినా.. ఫేస్‌బుక్‌ గాని, వాట్సప్‌ గాని మెసేజ్ లను వినదు, చదవదని తెలిపింది. మీరు పంపిన సమాచారం ఏదైనా ఇద్దరి మధ్యే ఉంటుందని వాట్సప్‌ తెలిపింది. ప్రైవేట్‌ పాలసీ అప్‌డేట్‌తో సమాచారానికి ఎటువంటి సమస్యలేదని స్పష్టం చేసింది. వాట్సప్‌ ప్రతి ఒక్కరి మెసేజ్‌లను, కాల్‌ చేస్తున్న వారివి నమోదు చేస్తుంది. మీరు పంపిన లోకేషన్‌ను వాట్సప్‌ గాని ఫేస్‌బుక్‌ గాని చూడలేదని తెలిపింది. వాట్సప్‌ తన వినియోగదారులను ఫేస్‌బుక్‌కు కూడా పంపదంది. వాట్సప్‌ గ్రూపులు ప్రైవేట్‌గానే ఉన్నాయి. మీరు మీ SMSలను డిలీట్ అయ్యేలా చేయవచ్చు. అంతేకాదు సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Latest Updates