ఈ ఫీచర్ ద్వారా ఫేక్ న్యూస్ కు చెక్

వాట్సాప్ లో బోలెడంత ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుంది. ఒక మెసేజ్ రాగానే, అది నిజమో కాదో తెలుసు కోకుండానే చాలా మంది వేరే వాళ్లకు ఫార్వార్డ్ చేస్తుంటారు. దీంతో తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. కొత్త ఫీచర్ ద్వారా ఏదైనా ఒక మెసేజ్ రాగానే, దాని పక్కనే ఒక సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ సమాచారం నిజమో కాదో తెలుసుకునేందుకు ఆ సెర్చ్ ఐకాన్ అవకాశం కల్పిస్తుంది. ఆ మెసేజ్ ను గూగుల్లో సెర్చ్ చేయాలా? వద్దా ? అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ సమాచారం గురించి అనుమానాలుంటే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. దీనికోసం యూజర్స్ వాట్సాప్ లో సెర్చ్ ‘అల్లో’ చేయాల్సి ఉంటుంది.

చేతులు కడుక్కున్నంత మాత్రానా సరిపోదు

Latest Updates