ఒకేసారి 8 మందితో వీడియో కాల్ .. వాట్సాప్ లో​ కొత్త ఫీచర్​

న్యూఢిల్లీ: వాయిస్​ కాల్​ అయినా, వీడియో కాల్​ అయినా ఇప్పటిదాకా వాట్సాప్​లో  నలుగురితోనే కాన్ఫరెన్స్​ కాల్​ మాట్లాడే వీలుండేది.  కరోనా పుణ్యమా అని ఆ సంఖ్య రెట్టింపు కానుంది. 8 మందితో కాన్ఫరెన్స్​ కాల్​ మాట్లాడుకునే వెసులుబాటును త్వరలోనే వాట్సాప్​ కల్పించనుంది. లాక్​డౌన్​తో అందరూ ఇళ్లలోనే ఉండడంతో ఫ్రెండ్స్​, చుట్టాలను ఫోన్లలో పలకరించే వాళ్లు ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలోనే కాన్ఫరెన్స్​లో ఎక్కువమంది మాట్లాడుకునేలా ఉంటే బాగుండని చాలా మంది నుంచి డిమాండ్లు వచ్చాయి. అందుకే వాట్సాప్​ ఈ నిర్ణయం తీసుకుంది. ఐవోఎస్​ వెర్షన్​ 2.20.50.23 లేదా ఆపైన, ఆండ్రాయిడ్​ వెర్షన్​ 2.20.128 లేదా ఆపైన వాటిలో పనిచేసేలా కోడ్​ తయారు చేసింది.

 

Latest Updates