యూజర్లను కాపాడుకునే ప్రయత్నంలో వాట్సాప్.. సరికొత్త స్టేటస్‌‌తో అందరికీ మెసెజ్

‘మా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరిస్తేనే.. మీ వాట్సాప్ అకౌంట్ పనిచేస్తుంది లేకపోతే అకౌంట్ నిలిపివేస్తాం’ అని యూజర్లను వార్న్ చేసిన వాట్సాప్.. క్రమంగా తన నిర్ణయాలను మార్చుకుంటోంది. నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించని యూజర్లు.. వేరే ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు చూస్తుండటంతో వాట్సాప్ తన కొత్త పాలసీని మే 15 వరకు వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. తాజాగా ఆదివారం కూడా తన వాట్సాప్ స్టేటస్‌ను ఉపయోగించుకొని.. యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

యూజర్లు తమ వాట్సాప్ ఓపెన్ చేసి.. స్టేటస్ చెక్ చేస్తే.. వాట్సాప్‌కు చెందిన కొత్త స్టేటస్ కనిపిస్తోంది. దాని క్లిక్ చేస్తే వాట్సాప్ పంపిన స్టేటస్‌లు కనిపిస్తాయి. యూజర్ ఒకసారి ఈ స్టేటస్ చూసిన తర్వాత.. మళ్లీ స్టేటస్ బార్‌లో ఈ లింక్ కనిపించడం లేదు.

‘మీ ప్రైవ‌సీకి క‌ట్టుబ‌డి ఉన్నాం.. మీ ప్రైవేట్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కాబ‌ట్టి వాటిని మేం చూసే, వినే అవకాశం లేదు.. మీరు షేర్ చేసిన లొకేష‌న్‌ మేం చూడ‌ం.. మీ కాంటాక్ట్‌ల‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోము’ అని స్టేటస్‌గా పెట్టి తన యూజర్లకు పంపిస్తోంది. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలామంది వాట్సాప్ యూజర్లు.. తమ పర్సనల్ డేటాకు భద్రత లేదని భావించి సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

For More News..

అయిదురోజుల్లో రెండుసార్లు గ్యాంగ్ రేప్‌కు గురైన 13 ఏళ్ల బాలిక

దేశంలోనే తొలి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అలర్జీ

పెళ్లి చేయమన్నందుకు కొడుకును చంపిన తండ్రి

దృశ్యం సినిమా స్ఫూర్తితో గర్ల్‌ఫ్రెండ్ మర్డర్.. ఆమె ఫోన్ నుంచి మెసెజ్‌లు చేస్తూ మేనేజ్

Latest Updates