డేటాను షేర్ చేయండి లేకపోతే అకౌంట్ డిలీట్.. వాట్సాప్ వార్నింగ్

ప్రముఖ ఆన్‌‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. యూజర్లు తమ డేటాను ఫేస్‌‌బుక్‌‌తో షేర్ చేయాలని లేకపోతే వారి అకౌంట్లను డిలీట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు అంగీకరించిన వారి అకౌంట్లను కొనసాగిస్తామని లేకపోతే డిలీట్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించిన మెసేజ్‌‌లతో యూజర్లకు అగ్రీ అనే అలర్ట్ ఆప్షన్ వస్తోంది. అగ్రీ చేస్తే వచ్చే నెల 8 నుంచి కొత్త ప్రైవేట్ పాలసీ ఆప్షన్‌‌ను అనుమతించినట్లే. యూజర్ల డేటాను ఫేస్‌‌బుక్‌‌తోపాటు మరికొన్ని యాప్స్, సర్వీసుల్లో షేర్ చేస్తామని వాట్సాప్ తెలపడంపై చాలా మంది యూజర్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవసీ పాలసీ నచ్చనివారు వాట్సాప్ నుంచి క్విట్ అవుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్ల వాట్సాప్‌‌ను అన్‌‌ఇన్‌‌స్టాల్ చేసి టెలిగ్రామ్‌, సిగ్నల్‌‌‌ యాప్స్‌‌కు షిఫ్ట్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోందని తెలుస్తోంది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ మీద ట్విట్టర్‌‌లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ప్రైవసీ పాలసీ మార్చిన తర్వాత యూజర్లు టెలిగ్రామ్ వైపు షిఫ్ట్ అవడంపై మరో క్రేజీ మీమ్ వైరల్ అవుతోంది. ఈ మీమ్‌‌లో ఒక అమ్మాయితో నడుస్తున్న వ్యక్తి మరో అమ్మాయి వైపు చూస్తాడు. ఈ క్రేజీ మీమ్స్‌‌ను మీరూ ఓ లుక్కేయండి మరి.

Latest Updates