వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి ఢోకా లేదు

లేటెస్ట్ అప్‌‌‌‌డేట్​పై విమర్శలు రావడంతో హామి ఇచ్చిన వాట్సాప్‌
ఫిబ్రవరి 8 లోపు పాలసీలను ఒప్పుకోకపోతే అకౌంట్ల నిలిపివేత

న్యూఢిల్లీ: వాట్సాప్‌‌‌‌ లేటెస్ట్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌పై వస్తున్న విమర్శలకు కంపెనీ స్పందించింది. ఈ అప్‌‌‌‌డేట్‌‌‌‌ వలన బిజినెస్‌ కమ్యూనికేషన్‌‌‌‌(ప్రొడక్ట్‌‌‌‌ల గురించి ప్రచారం చేసుకోవడం)కు వీలుంటుందని, డేటా షేరింగ్‌‌‌‌ రూల్స్‌‌‌‌లో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొంది. యూజర్ల డేటాను ప్రాసెస్‌ చేయడానికి, ఫేస్‌ బుక్‌‌తో పంచుకోవడానికి వీలు కల్పించే పాలసీలను ఈ వారం ప్రారంభంలో వాట్సాప్‌‌‌‌ తీసుకొచ్చింది. ఈ పాలసీలకు ఫిబ్రవరి 8 లోపు అంగీకారం తెలపాలని యూజర్లను వాట్సాప్‌‌‌‌ కోరింది. పాలసీలు, టెర్మ్స్‌ ఆఫ్ సర్వీస్‌‌లను అంగీకరించని కస్టమర్ల అకౌంట్లు నిలిచిపోతాయి. కాగా, వాట్సాప్ లేటెస్ట్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌పై గ్లోబల్‌‌‌‌గా వ్యతిరేకత వస్తోంది. దీన్ని సిగ్నల్‌‌‌‌, టెలిగ్రాం వంటి మెసెంజర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా ఈ యాప్‌‌‌‌ల డౌన్‌‌‌‌లోడ్లు పెరగడం విశేషం. వాట్సాప్‌‌‌‌ను వదిలేయాలని ప్రజలకు టెస్లా సీఈఓ ఎలన్‌‌‌‌ మస్క్‌‌‌‌ పిలుపునిచ్చా రు కూడా. పారదర్శకతను మెరుగుపరిచేందుకు, బిజినెస్ కమ్యూనికేషన్‌‌‌‌ ఫీచర్‌‌ను అందించేందుకు లేటెస్ట్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ను తీసుకొచ్చామని వాట్సాప్‌‌‌‌ హెచ్‌ విల్‌‌‌‌ క్యాత్‌ కార్ట్‌‌‌‌ పేర్కొన్నారు. ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌‌‌‌క్రిప్షన్‌‌‌‌తో యూజర్ల చాట్స్‌‌‌‌ లేదా కాల్స్‌‌‌‌ను వాట్సాప్‌‌‌‌ కాని, ఫేస్‌ బుక్ కాని యాక్సెస్‌ చేయలేవని తెలిపారు. ప్రస్తుతం యూజర్ల డేటా ప్రైవసీపై ఇతర కంపెనీలతో పోటీపడుతున్నామని, ఇది మంచి విషయమేనని అన్నారు. తమ చాట్స్, కాల్స్‌‌‌‌ను మూడో వ్యక్తి ఎవరూ చూడడం లేదని ధైర్యం యూజర్లకు ఉంటుందని పేర్కొన్నారు. కాగా విల్‌‌‌‌ క్యాత్‌ కార్ట్‌‌‌‌ ట్విట్‌‌‌‌పై మిశ్రమ స్పందనలొస్తున్నాయి.

For More News..

బర్డ్‌ఫ్లూ బారిన మరో రాష్ట్రం.. మొత్తం ఏడు రాష్ట్రాలలో వ్యాప్తి

గుళ్లోకి లాక్కెళ్లి మహిళపై అత్యాచారం.. 5 గంటల తర్వాత వదిలేసిన కామాంధులు

పోలియో చుక్కల కార్యక్రమం వాయిదా

Latest Updates