వాట్సప్ గ్రూప్ లో యాడ్ చేయాలంటే మీ అనుమతి మస్ట్

WhatsApp will soon require that admins ask permission from users before adding them to a group

WhatsApp will soon require that admins ask permission from users before adding them to a groupవాట్సాప్ గ్రూపుల్లో నాన్ స్టాప్ మెసేజెస్ మోతతో ఇబ్బంది పడుతున్నారా? మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ లో యాడ్ చేశాక ఎగ్జిట్ అయితే ఫీలవుతారని మొహమాటానికి కంటిన్యూ అవుతున్నారా? మిమ్మల్ని అడగకుండా యాడ్ చేశారని టార్చర్ ఫీలవుతున్నారా?

ఇకపై ఈ రకమైన బాధ ఉండబోదు. కొత్తగా ఏదైనా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలంటే మీ పర్మిషన్ కావాల్సిందే. ఇష్టం లేకుండా ఎవరూ, ఏ గ్రూప్ లోనూ యాడ్ చేయలేరు. ఇక గ్రూప్ అడ్మిన్ ఇష్టానికి యాడ్ చేసేయడం కుదరదు. దీనికి సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. కొత్తగా గ్రూప్ లో ఎవరినైనా యాడ్ చేయాలంటే అడ్మిన్ ఇన్వైట్ లింక్ పంపాల్సిందే. దానికి 72 గంటల్లో రెస్పాండ్ అయితే సరే. లేదంటే అది ఎక్స్ పైర్ అయిపోతుంది. దాన్ని బట్టి మీకు ఇష్టం లేదని అడ్మిన్ సైలెంట్ అయిపోతారేమో కదా!!

ఈ కొత్త ఫీచర్ ను త్వరలోనే వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే దీనిపై వర్క్ జరుగుతోందని వాబీటా ఇన్ఫో రిపోర్ట్ వెల్లడించింది.

  • కొత్త ఫీచర్ ఇలా ఉండొచ్చని సమాచారం
  • వాట్సాప్ సెట్టింగ్స్ లో కొత్త మార్పులు
  • సెట్టింగ్స్ > అకౌంట్ > ప్రైవసీ > గ్రూప్స్ > హ్యూ క్యాన్ యాడ్ మీ టూ గ్రూప్ లోకి వెళ్తే అక్కడ మూడు ఆప్షన్స్ ఉంటాయి.
  • అవి ఎవర్రిబడీ, మై కాంటాక్ట్స్, నోబడీ.
  • వాటిలో ఎవర్రిబడీ సెలెక్ట్ చేస్తే ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసే పర్మిషన్ ఇచ్చినట్లే.
  • మై కాంటాక్ట్స్ అంటే మీ ఫోన్లో కాంటాక్ట్ నంబర్ సేవ్ అయి ఉంటే మాత్రమే గ్రూప్ అడ్మిన్, యాడ్ చేయగలుగుతారు.
  • ఇక నోబడీ సెలెక్ట్ చేస్తే, ఎవరూ మీ పర్మిషన్ లేకుండా గ్రూప్ లో యాడ్ చేయలేరు. ఎవరైనా గ్రూప్ లో యాడ్ చేసే ప్రయత్నం చేస్తే మీకు ఒక ఇన్వైట్ లింక్ వస్తుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆ గ్రూప్ లో మెంబర్ అవుతారు.
  • గ్రూప్ లోకి వెళ్లడం ఇష్టం లేకపోతే పట్టీ పట్టనట్లుంటే చాలు. 72 గంటల్లో ఆ లింక్ ఎక్స్ పైర్ అవుతుంది.
  • ఈ కొత్త ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలోనూ రాబోతోంది.

Latest Updates